దిశ ఉమెన్స్ ప్రొటెక్షన్ భద్రాచలం మండల అధ్యక్షురాలిగా యాస బేబీ నియామకం
భద్రాచలం, సెప్టెంబర్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలో దిశ ఉమెన్స్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దిశ ఉమెన్స్ ప్రొటెక్షన్ భద్రాచలం మండల అధ్యక్షురాలిగా యాస బేబీని నియమిస్తూ ఆమెకు ఐడి కార్డు అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి పాల్గొని మాట్లాడుతూ మహిళల రక్షణ, వారి సంక్షేమం కోసం దిశ ఉమెన్స్ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగినా, వారి వెంట నిలబడి సమస్యలను పరిష్కరించడమే సంస్థ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
అధ్యక్షురాలిగా నియమితులైన యాస బేబీ మాట్లాడుతూ—“నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి గారికి, జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి లత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా సయాశక్తులతో కృషి చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌండేషన్ ప్రతినిధులు, స్థానిక మహిళా నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment