3 లక్షలు 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పట్టణ ప్రణాళిక అధికారి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట పురపాలక సంఘంలో పెద్ద అవినీతి వెలుగుచూసింది. లేఅవుట్ ప్రహరీ గోడ, గేట్ల తొలగింపు విషయంలో ఫిర్యాదుదారునికి సాయం చేస్తానని నెపం చెప్పి పట్టణ ప్రణాళిక అధికారి చింతల రాధా కృష్ణ రెడ్డి భారీ లంచం డిమాండ్ చేశారు.
ఫిర్యాదుదారుని నుండి మొత్తం రూ.5,00,000/- లంచం అడిగిన ఆయన, అందులో ఇప్పటికే రూ.1,50,000/- స్వీకరించారు. మిగతా రూ.3,50,000/- స్వీకరిస్తున్న సమయంలోనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉచ్చుపట్టి పట్టుకున్నారు.
👉 ప్రజలకు హెచ్చరికగా ACB విజ్ఞప్తి చేస్తూ –
“ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు డయల్ చేయండి. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు” అని స్పష్టం చేసింది.
Post a Comment