లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జూనియర్ లైన్‌మెన్
హైదరాబాద్, సెప్టెంబర్ 26: రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు మరోమారు లంచగొండిని పట్టుకున్నారు. ప్రజల ఇళ్లకు విద్యుత్ సరఫరా పనుల్లో సహాయం చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ లైన్‌మెన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
గచ్చిబౌలి డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్, ఫిర్యాదుదారుని ఇంటికి 5 కె.వి. నుండి 11 కె.వి. వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించే పనుల్లో సహాయం చేస్తానని, వైరింగ్ మార్చడంలో, అలాగే ఇంట్లో ఉన్న మీటర్‌ను విప్పి మళ్లీ సీల్ చేయడంలో అధికారిక సహకారం అందిస్తానని చెప్పి రూ.30,000/- లంచం డిమాండ్ చేశాడు.
ఫిర్యాదుదారు అనిశాకు ఫిర్యాదు చేయడంతో, ACB అధికారులు పన్నిన వలలో జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు. ముందుగా ఒప్పుకున్న లంచం మొత్తంలో రూ.11,000/- తీసుకుంటూ ఉండగా ఆయనను అధికారులు పట్టుకుని సాక్ష్యాలతో అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి
లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగి/అధికారి పట్ల వెంటనే ఫిర్యాదు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ పిలుపునిచ్చింది.
దీనికోసం ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా
- వాట్సాప్ : 9440446106
- ఫేస్‌బుక్ : Telangana ACB
- ఎక్స్ (Twitter): @TelanganaACB
- వెబ్‌సైట్ : acb.telangana.gov.in
ద్వారా కూడా సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు.
ACB అధికారులు, ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని స్పష్టం చేశారు.
Post a Comment