తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ పాల్వంచకు రాక
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ పాల్వంచకు రాక
పాల్వంచ, సెప్టెంబర్ 25: జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల విజయభాస్కర్ రావు పాల్వంచ కేటీపీఎస్ సెవెన్ స్టేజ్ జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేటీపీఎస్ మెయిన్ గెస్ట్ హౌస్‌లో జరగబోయే జాతీయ మాల మహానాడులో తెలంగాణ పోరాట యోధురాలు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ గారి మనుమరాలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ పాల్గొననున్నట్లు తెలిపారు.
“చాకలి ఐలమ్మ ఆదిపత్య కులాల దురాహంకారాలకు ఎదురొడ్డి, కష్టం మాది – ఫలితం మీదే అన్న దోపిడీ విధానానికి శస్త్రాన్ని చూపి సమాజంలో బహుజన శ్రామిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారు. నేటికీ ఆమె స్ఫూర్తి మార్గదర్శకం” అని బూరుగుల విజయభాస్కర్ రావు పేర్కొన్నారు.
ఈ మహానాడుకు కులమత భేదాలు లేకుండా అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం బూరుగుల విజయభాస్కర్ రావు
Post a Comment