ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు – ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు – ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు कि రేపు చంద్రుగొండ మండలంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి పోలీసులు అన్ని రకాల పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

లక్ష్య గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బందోబస్తు విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందితో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. ఈ పర్యటన కోసం సుమారు 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ముందస్తుగా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు:

📍 రేపు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు –

  • VM బంజర → కొత్తగూడెం వెళ్ళే వాహనాలు కల్లూరు – తల్లాడ – ఏన్కూర్ – జూలూరుపాడు మీదుగా ప్రయాణించాలి.
  • కొత్తగూడెం → VM బంజర వెళ్ళే వాహనాలు ఏన్కూర్ – తల్లాడ – కల్లూరు మీదుగా వెళ్లాలి.

సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాటించాలని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.