తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు
వరంగల్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు
వరంగల్, ఆగస్టు 29: వరంగల్ జిల్లా వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం అనిశా అధికారులు వరంగల్ ఫోర్ట్ తహసీల్దార్ నివాసం సహా ఆయనకు, బంధువులకు చెందిన ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు స్థిరాస్తులు, చరాస్తులు బయటపడ్డాయి.
గుర్తించిన ఆస్తులు:
- భవనం – రూ.1.15 కోట్లు విలువ
- వ్యవసాయ భూమి – 17.10 ఎకరాలు (రూ.1.43 కోట్లు విలువ)
- బంగారం – 70 తులాలు
- వెండి – 1.791 కిలోలు
- చేతి గడియారాలు – 23
- వాహనాలు – నాలుగు చక్రాల వాహనాలు 2, ద్విచక్ర వాహనం 1
- గృహోపకరణాలు
మొత్తం డాక్యుమెంట్ విలువ ప్రకారం గుర్తించిన ఆస్తులు దాదాపు రూ.5.02 కోట్లు ఉంటాయని అనిశా అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
ప్రజలకు సూచన:
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగిన సందర్భంలో ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
- టోల్ ఫ్రీ నెంబర్ : ☎️ 1064
- వాట్సాప్ : 📱 9440446106
- ఫేస్‌బుక్ : Telangana ACB
- ఎక్స్ (Twitter) : @TelanganaACB
- వెబ్‌సైట్ : 🌐 acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

Post a Comment