మెదక్ జిల్లాలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు

 

మెదక్ జిల్లాలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు

మెదక్, ఆగస్టు 28: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లాలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆయన పరామర్శించారు.

మనోహరాబాద్, తూప్రాన్, రామాయంపేట, నార్సింగి, మెదక్ మండలాల్లో ఆయన పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జిల్లాలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు.

ఎంపీతో పాటు భాజపా నాయకులు, వివిధ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.