మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటించిన ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్
నారాయణఖేడ్, ఆగస్టు 28: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ గురువారం పలు మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటించారు.
వార్డ్ 12, 13తో పాటు వెంకటేశ్వర థియేటర్ పరిసరాలు, కాశీ విశ్వనాథ దేవాలయం, బడి మస్జిద్, ఖురేషీ మస్జిద్, ముత్యాల పోచమ్మ దేవాలయం మరియు ఇతర కాలనీలలో ఆయన ప్రజలను ఇంటింటికీ కలుసుకుని సమస్యలను ఆరా తీశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంఐఎం పార్టీ కృషి చేస్తుందని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని మొహీద్ పటేల్ హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ఎంఐఎం నాయకులు మజ్హార్, చంద్ పాషా, సల్మాన్ పటేల్, అయ్యూబ్, అహద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment