దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు
దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి ఆధ్వర్యంలో రెండవ రోజు దేవి బ్రహ్మచారిణి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాసర్ల నాగమణి మాట్లాడుతూ, “బ్రహ్మచారిణి అమ్మవారి పూజలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం లభిస్తాయి. మహిళలు ధర్మపథంలో నడిచి సకల శుభాలు పొందాలని” ఆకాంక్షించారు.
నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామని ఫౌండేషన్ తరఫున నిర్వాహకులు తెలిపారు.
Post a Comment