ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతమ్‌కు ఘన సన్మానం
సుజాతనగర్, సెప్టెంబర్ 12: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతమ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఘనంగా సన్మానించారు. జిల్లా పర్యటనలో భాగంగా సుజాతనగర్‌లోని నాగా సీతారాములు నివాసానికి విచ్చేసిన ప్రీతమ్‌ను ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, "రాబోయే రోజుల్లో నాగరి ప్రీతమ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేస్తారని నమ్ముతున్నాను" అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పతి కుమార్, ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొందయ్య, నాయకులు గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment