ఆయుధాల విరమణపై మావోయిస్టుల సంచలన నిర్ణయం
సెప్టెంబర్ 16: మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలను విడిచి పెట్టి ప్రధాన స్రవంతిలోకి రావడానికి సిద్ధమని పేర్కొన్నారు.
లేఖలోని ముఖ్యాంశాలు:
- 30 రోజులపాటు కాల్పుల విరమణ ప్రతిపాదన
- కేంద్ర హోంశాఖ మంత్రి లేదా ఆయన ప్రతినిధితో చర్చలకు సిద్ధం
- వీడియో కాల్ ద్వారా అయినా సంప్రదింపులకు అంగీకారం
- ప్రజా సమస్యలపై ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యమాలతో కలసి పనిచేయాలని సంకేతం
మావోయిస్టు సుప్రీం లీడర్ బసవరాజు మరణం తరువాత, కొత్త ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా, ఎన్నడూ లేని విధంగా అజ్ఞాత నేత ఫొటోతో లేఖ విడుదల కావడం విశేషంగా మారింది.
అభయ్ లేఖలో గతంలో శాంతిచర్చల ప్రతిపాదనలు చేసినప్పటికీ, కేంద్రం స్పందించలేదని విమర్శించారు. అయితే, తమతో పాటు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు శాంతి చర్చలకు సిద్ధమైతే, ఈసారి కొత్త దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
🔹 మావోయిస్టుల ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ, శాంతిచర్చల ప్రక్రియకు కొత్త మార్గం సుగమం చేస్తుందా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Post a Comment