ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ లారీ కారును డీ అక్కడిక్కడే ఏడుగురు మృతి

 

ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ లారీ కారును డీ అక్కడిక్కడే ఏడుగురు మృతి

నెల్లూరు, సెప్టెంబర్‌ 17: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఓ కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే విషాదం నెలకొంది.

సాక్షుల వివరాల ప్రకారం, కారు పూర్తిగా ధ్వంసమైపోగా, అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢీకొట్టిన శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మృతుల పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఈ దారుణ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో కన్నీటి వాతావరణం నెలకొంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.