మంచిర్యాలలో నకిలీ సిగరెట్ల కలకలం నకిలీ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు స్వాధీనం
మంచిర్యాల, సెప్టెంబర్ 18: మంచిర్యాల పట్టణంలో గురువారం నకిలీ సిగరెట్ల వ్యాపారం బయటపడింది. ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ విభాగం, పట్టణ పోలీసులతో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కృష్ణ జనరల్ స్టోర్, పవన్ కిరాణం అండ్ జనరల్ స్టోర్ల వద్ద విస్తృతంగా పరిశీలనలు జరిపి భారీ మొత్తంలో నకిలీ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
దాడుల్లో ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ అధికారులు నాగేశ్వరరావు, రమాకాంత్, అలాగే పట్టణ ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు. అక్రమంగా నకిలీ సిగరెట్ల విక్రయం జరుగుతుందన్న సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనతో పట్టణ వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. నకిలీ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Post a Comment