నగరంలో జింక మాంసం కలకలం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: రాజధానిలో జింక మాంసం అక్రమ రవాణా కలకలం రేపింది. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు అర్ధరాత్రి టోలిచౌకిలో మావిన్ క్లాసిక్ అపార్ట్‌మెంట్ వద్ద సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 కిలోల జింక మాంసం, మూడు జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం (AP09BT4716)ను సీజ్ చేశారు.
అక్రమ రవాణాలో నిమగ్నమైన మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మాంసం, వాహనాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేరానికి జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని స్పష్టం చేశారు.
“ప్రతి ఒక్కరూ వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని కోరుకుంటున్నాం” అని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు.
Post a Comment