రోడ్డు భద్రతపై ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన


కరీంనగర్, సెప్టెంబర్ 12: తిమ్మాపూర్‌లోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు రోడ్డు రవాణా శాఖ (RTA) ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు హెల్మెట్‌ వినియోగం, కార్లలో సీటు బెల్ట్‌ తప్పనిసరి అనే అంశాలను వివరించారు. వాహనం నడపాలంటే కనీసం 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి, తప్పనిసరిగా RTO కార్యాలయం నుండి లైసెన్స్‌ పొందాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు వాహనం నడిపితే వాహన యజమానిపై జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధిస్తారని హెచ్చరించారు.

అలాగే వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌ వినియోగం ప్రమాదకరమని, రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాల‌ని విద్యార్థులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో RTA ఇన్‌స్ట్రక్టర్‌ జయ గౌడ్, ఉపాధ్యాయులు జక్కు కృష్ణమూర్తి గౌడ్, వాణి, వంగ ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.