అమెరికాలో దుర్ఘటన పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో దుర్ఘటన పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో దుర్ఘటన పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

మహబూబ్‌నగర్ : అమెరికాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. 2016లో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన నిజాముద్దీన్ చదువులు పూర్తయ్యాక ఉద్యోగం దొరకకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలసి నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 3న రూమ్‌మేట్స్ మధ్య గొడవ చెలరేగడంతో స్థానిక పోలీసులకు సమాచారం చేరింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిజాముద్దీన్ కత్తితో ఒకరిపై దాడి చేస్తున్నారని గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటనపై అమెరికా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, స్వస్థలమైన మహబూబ్‌నగర్‌లో ఈ వార్త తెలిసి బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.