కలుపుమందు తాగి తీవ్రంగా అస్వస్థతకు గురైన ఆశా వర్కర్ మంగళవారం మృతి
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కలుపుమందు తాగి తీవ్రంగా అస్వస్థతకు గురైన ఓ ఆశా వర్కర్ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం – సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన జొన్నలగడ్డ వెంకటమ్మ (35) గత కొంతకాలంగా అయ్యగారి పేట ప్రాంతంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. గత నెల 24వ తేదీన వ్యక్తిగత కారణాలతో ఆమె మనస్తాపానికి గురై కలుపుమందు తాగినట్టు తెలుస్తోంది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను మొదట సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, ఆ తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది.
మృతురాలికి భర్త జొన్నలగడ్డ రాజా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment