ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు.
పార్లమెంట్‌లోని రెండు సభలకు చెందిన 781 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండగా, వారిలో 767 మంది ఓటు హక్కు వినియోగం చేశారు. వీటిలో 15 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి. మిగతా లెక్క ప్రకారం రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.
దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు తటస్థంగా ఉంటూ పోలింగ్‌కు దూరంగా నిలిచాయి.
➡️ మొత్తం ఓటర్లు: 781
➡️ పోలైన ఓట్లు: 767
➡️ చెల్లని ఓట్లు: 15
➡️ రాధాకృష్ణన్ (ఎన్డీఏ): 452
➡️ సుదర్శన్ రెడ్డి (ఇండియా కూటమి): 300
➡️ మెజార్టీ: 152 ఓట్లు
రాధాకృష్ణన్ విజయం సాధించడంతో ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఇక సుదర్శన్ రెడ్డి గెలుపుపై ఇండియా కూటమి ఆశలు విరమించుకోవాల్సి వచ్చింది.

Post a Comment