కరీంనగర్ దీపిక ఆసుపత్రిలో ఘోర ఘటన – నిందితుడు అరెస్ట్
కరీంనగర్: సెప్టెంబర్ 10: కరీంనగర్ నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఒక యువతిపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు.
సీపీ గౌస్ ఆలం వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లాకు చెందిన యువతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ సెప్టెంబర్ 6న కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో ఆసుపత్రిలో OT టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహారాష్ట్ర సిరోంచకు చెందిన దక్షిణామూర్తి (23) అనే వ్యక్తి మద్యం సేవించి హాస్పిటల్‌కు వచ్చాడు.
అనారోగ్యంతో ఉన్న బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, సీసీ కెమెరాలకు కనిపించకుండా వాటిపై పరదా వేసి అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని మొబైల్ ఫోన్‌లో కూడా అశ్లీల చిత్రాలు, వీడియోలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కి పంపించగా, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం పట్ల కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నగర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Post a Comment