సురవరం అమర్ రహే" నినాదాలతో సంస్మరణ సభకు తరలి వచ్చిన సిపిఐ శ్రేణులు

సురవరం అమర్ రహే" నినాదాలతో సంస్మరణ సభకు తరలి వచ్చిన సిపిఐ శ్రేణులు

"సురవరం అమర్ రహే" నినాదాలతో సంస్మరణ సభకు తరలి వచ్చిన సిపిఐ శ్రేణులు

కొత్తగూడెం: సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ మంగళవారం కొత్తగూడెం క్లబ్ ఆవరణలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి పట్టణంలోని గాజులు రాజం బస్తీ 57వ డివిజన్ నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. మాజీ కౌన్సిలర్ సాహెరా బేగం ఆధ్వర్యంలో వచ్చిన నాయకులు, కార్యకర్తలు "సురవరం అమర్ రహే" అంటూ నినాదాలు చేస్తూ సభలో పాల్గొన్నారు.

అదేవిధంగా, సిపిఐ పార్టీ 3 టౌన్ ఏరియా కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ యూసుఫ్ నేతృత్వంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు క్లబ్ ప్రాంగణానికి చేరుకొని స్వర్గీయ సురవరం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ శాఖ కార్యదర్శి దామెర కుమార్, ధర్మయ్య, పిల్లి రామస్వామి, దీటి రాజా శ్రీనివాస్, టి. రాయాలింగు, ఎరువ శివకుమార్, సునిల్, దిలీప్, లాలయ్య, సరోజ, ఆర్‌పి రాజకుమారి, అనూష, విజయలక్ష్మి, రమా, సైండ్ల స్వాతి తదితరులు పాల్గొన్నారు. సభలో సిపిఐ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు విస్తృతంగా హాజరయ్యారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.