ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్


భద్రాద్రి కొత్తగూడెం: మంగళవారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుందని, ఆ క్రమంలోనే గోడౌన్‌ను సందర్శించినట్టు తెలిపారు. ఈ తనిఖీలో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదులు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డులు పరిశీలించారు.

గోడౌన్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరాదని అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లపై సంతకం చేశారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, బీజేపీ ప్రతినిధి నోముల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మణ్ అగర్వాల్, ఆప్ పార్టీ రాంబాబు, సిపిఐ ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, సిపిఐఎం ప్రతినిధి ఎస్‌కే సలీం, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.