పంజాబ్ వరద ప్రాంతాల్లో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ బృందం పర్యటన
న్యూఢిల్లీ: జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) జాతీయ కార్యదర్శి మౌలానా షఫీ మదనీ, ఇతర జమాత్ నాయకులతో కలిసి పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సుల్తాన్‌పూర్ లోధీ (కపూర్తల జిల్లా)లో సంగ్రా, బౌపూర్ జదీద్ గ్రామాలు, పఠాన్‌కోట్ జిల్లా లోని సుందర్ చక్, బహదర్పూర్, కోలియా సఫర్ తహసీల్ మరియు జలంధర్‌లోని సిందుపూర్ ప్రాంతాల్లో పర్యటించారు.
కోలియా గ్రామంలో వరదలతో 30 సిమెంట్ ఇళ్లే కూలిపోయాయి. దురదృష్టవశాత్తూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు చిన్నారులు, 75 ఏళ్ల వృద్ధ అమ్మమ్మ ఉన్నారు.
ఈ పర్యటనలో జిహెచ్ బృందం సిక్కు కమ్యూనిటీ నాయకులు, నోడ్‌ల్ అధికారులు, బాధిత గ్రామస్తులతో సమావేశమై వారి అత్యవసర అవసరాలను అంచనా వేసింది. ఆహారం, నివాసం, తాగునీరు, వైద్యసేవలు, దీర్ఘకాల పునరావాసం వంటి అంశాలపై చర్చలు జరిపి సహాయక చర్యలను సమగ్రంగా అమలు చేయాలని నిర్ణయించారు.
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ వాలంటీర్లు, సొసైటీ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ కార్యకర్తలు సాయం, రక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నారు. వైద్య సహాయం అందిస్తూ, నిరాశ్రయ కుటుంబాలకు అన్ని విధాల సహకరిస్తున్నారు.
“వరద బాధితులు పడుతున్న ఇబ్బందులు మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. జమాత్-ఎ-ఇస్లామీ హింద్, మా భాగస్వామ్య సంస్థలతో కలిసి ఆహారం, నివాసం, ఆరోగ్య సేవలు, పునరావాసం వంటి అన్ని ప్రాథమిక సాయం అందించడానికి కట్టుబడి ఉంది. సాధారణ స్థితి పూర్తిగా పునరుద్ధరించేవరకు మేము ప్రజలకు అండగా ఉంటాం,” అని జమాత్-ఎ-ఇస్లామీ హింద్ జాతీయ కార్యదర్శి మౌలానా షఫీ మదనీ అన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ, “వరద ప్రభావిత ప్రజలతో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఎల్లప్పుడూ ఉంటూ, వారి సహాయం, పునరావాసం కోసం నిరంతరం కృషి చేస్తుంది. ప్రభుత్వం త్వరితగతిన సహాయం పంపిణీ చేయాలని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, బాధితులకు తగిన పరిహారం ప్యాకేజీలు ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము” అన్నారు.
మౌలానా షఫీ మదనీ ప్రజలకు, దాతృత్వపరులకు కూడా పిలుపునిస్తూ, “బాధిత కుటుంబాల పక్కన నిలబడి, వారిని ఈ సంక్షోభం నుంచి బయటపడేలా సహకరించండి” అని కోరారు.
Post a Comment