🛑 బిగ్ బ్రేకింగ్ – నేపాల్ రాజకీయాల్లో తుఫాన్ 🛑

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి (KP Oli) తన పదవికి రాజీనామా చేశారు.


సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుండి హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు అదుపు తప్పాయి. పార్లమెంట్ ముట్టడిలో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా, 20 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మందికి గాయాలయ్యాయి.

ఈ ఘటనల తరువాత ప్రజల ఒత్తిడి పెరగడంతో, హోంమంత్రి ఇప్పటికే రాజీనామా చేసినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితులను సమీక్షించిన సైన్యం, ఓలిని పదవి నుంచి తప్పుకోవాలని సూచించిందని సమాచారం.

👉 రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలిని సైన్యం రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది.
👉 ఈ సాయంత్రం లోపలే కొత్త ప్రధాని ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
👉 ప్రస్తుతం కొత్త ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

🔴 నేపాల్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి…

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.