ఏసీబీ వలలో నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక
హైదరాబాద్ : రాష్ట్రంలో అవినీతి పై ఏసీబీ (Anti-Corruption Bureau) బిగుసుకున్న పట్టు కొనసాగుతోంది. తాజాగా నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.
సమాచారం ప్రకారం, మంచిరేవుల ప్రాంతంలో ఉన్న రాధ రియల్టర్ వెంచర్ లోని ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇవ్వడానికి మణిహారిక 10 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు వినోద్ ఏసీబీని సంప్రదించగా, అధికారులు ఉచ్చుపన్ని ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో, 4 లక్షల రూపాయల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు మణిహారికను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆమెను విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
అధికారుల ముందు కంటతడి పెట్టిన మణిహారిక, తాను తప్పు చేయలేదని చెప్పినా, ఏసీబీ అధికారులు మాత్రం సరైన సాక్ష్యాలతో పట్టుబడినందున ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post a Comment