కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ

కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ


కిన్నెరసాని/పాల్వంచ, సెప్టెంబర్ 16: కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలకు ముందుగా ప్రత్యేక లోగోను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు.

లోగో ఆవిష్కరణ అనంతరం పలువురు ప్రసంగిస్తూ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైర్డ్ టీచర్ చక్రవర్తి మాట్లాడుతూ, ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, గత అయిదు దశాబ్దాలుగా ఈ విద్యాసంస్థ వేలాది గ్రామీణ విద్యార్థుల జీవితాలను వెలిగించిందని, భవిష్యత్తులోనూ పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా ముందుకు వచ్చి డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, వెంకటరత్నం, శ్రీనివాస్ కుమార్, ఎం. సత్యనారాయణ తదితర పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వివిధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.