నేపాల్‌లో అత్యవసర పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ హెల్ప్‌లైన్ ఏర్పాటు
నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయబడింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందించబడుతుంది.
✅ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎలాంటి తెలంగాణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
✅ రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
అత్యవసర సమయంలో సంప్రదించవలసిన అధికారులు:
- 📞 శ్రీమతి వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ – +91 9871999044
- 📞 శ్రీ జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157
- 📞 శ్రీ సిహెచ్. చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి – +91 9949351270
ప్రభుత్వం తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని మరియు తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసింది.

Post a Comment