బెజ్జుర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

బెజ్జుర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి


కొమురం భీం జిల్లా, బెజ్జుర్ మండల కేంద్రంలో తెలంగాణా వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దేవనపల్లి సత్తయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెలంగాణా రైతాంగ పోరాటాలకు ప్రేరణగా నిలిచారని గుర్తుచేశారు. సెప్టెంబర్ 26, 1895న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలకు జన్మించిన ఐలమ్మ, చిన్న వయసులోనే చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆమె చాకలి కులవృత్తే ఆధారమైందని పేర్కొన్నారు.

దొరల అన్యాయ పాలనకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో పోరాడిన ఐలమ్మ, రోకలి బండతో గూండాలను తరిమికొట్టి, దొరలను సవాలు చేసి 90 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టిన ఘనత ఆమెదేనని తెలిపారు. భూపోరాటం నుంచి సాయుధ పోరాటం వరకు వేలాది మంది ఉత్పత్తి కులాల త్యాగాలకు ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని సత్తయ్య అన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరగడానికి ఆమె పోరాటమే మార్గదర్శకమైందని గుర్తుచేశారు.

చివరిగా సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో ఆమె మరణించినా, ప్రజా ఉద్యమాలకు ఐలమ్మ స్ఫూర్తి శాశ్వతమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో పొన్న వెంకటేష్, పొన్న రాకేష్, కడ ముంత రాకేష్, పొన్న కార్తిక్, దేవనపల్లి నవీన్, శ్రీరామ శేఖర్, డాక్టర్ ఇబ్రహీం, Md సౌఖత్ఖాన్, పోల్క వెంకటేష్, కొండ్రా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.