ఖమ్మం మున్నేరు పాత వంతెనపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం.
ఖమ్మం : సెప్టెంబర్ 10: ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు వంతెనపై కొత్త తీగల వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారీ యంత్రాలు, సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నందున పాత వంతెనపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రకటించింది.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ వివరాల ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మున్నేరు పాత వంతెనపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
అంతేకాక, అత్యవసర సేవల వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Post a Comment