రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెం లైబ్రరీ మీటింగ్ హాల్‌లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ,
"లోక్ అదాలత్ వేదికను సద్వినియోగం చేసుకుని, వివాదాలను సామరస్యంగా మరియు త్వరగా పరిష్కరించుకోవచ్చు" అని అన్నారు. రాజీ కాదగిన సివిల్, క్రిమినల్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, ఎన్‌ఐ యాక్ట్ కేసులు, మీడియేషన్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.
కక్షిదారులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలని, దీని ద్వారా న్యాయవ్యవస్థపై భారం తగ్గడంతో పాటు, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, గోపికృష్ణ, అడపాల పార్వతి, చిన్ని కృష్ణ, పురుషోత్తం రావు, నిరంజన్ రావు, సీనియర్-జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment