కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి వినతి

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి వినతి

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు రాష్ట్ర మంత్రి తుమ్మల విజ్ఞప్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ –

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన వెంటనే సివిల్ ఏవియేషన్‌ శాఖ ఫీజుబులిటీ సర్వే నిర్వహించినందుకు రాంమోహన్ నాయుడు కు ధన్యవాదాలు తెలిపారు.
  • మొదట ప్రతిపాదించిన స్థలం అనుకూలం కానందున, రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలాన్ని సూచించిందని, అక్కడ త్వరితగతిన సర్వే నిర్వహించి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
  • భద్రాద్రి రామాలయం దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతో సౌకర్యం కల్పిస్తుందని, పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల్లో జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు.

తుమ్మల మాట్లాడుతూ – “జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి సంస్థలతో పాటు అరుదైన ఖనిజ నిక్షేపాలు, ఎకో టూరిజం కు కేరాఫ్‌గా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భవిష్యత్తులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ వలన మరింత పురోగతి సాధిస్తుంది. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం. ఈ ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే నిజం అవుతుంది” అన్నారు.

రాంమోహన్ నాయుడు వంటి తెలుగు బిడ్డ చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కల సాకారం అవుతుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమపై చర్చ
ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర భారీ పారిశ్రామల, ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామి ను కూడా కలిశారు.
బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.