తెలంగాణలో వర్షాల హడావిడి.. ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ

 

తెలంగాణలో వర్షాల హడావిడి.. ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

👉 బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

👉 గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

👉 శనివారం రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

🌧️ ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

📊 అత్యధికంగా మెదక్‌ జిల్లా రేగోడు గ్రామంలో 7.8 సెంటీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలో 6.6 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా గోధురులో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ వెల్లడించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.