జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి: జిల్లా ఎన్నికల అధికారి
హైదరాబాద్: సెప్టెంబర్ 17: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని నోడల్ అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రాథమిక సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
- మ్యాన్‌పవర్, ఈవీఎంలు, వివిప్యాట్ రవాణా, శిక్షణ, మెటీరియల్ మేనేజ్మెంట్
- ప్రవర్తన నియమావళి అమలు
- శాంతిభద్రతలు, వల్నరబులిటీ మ్యాపింగ్
- జిల్లా సెక్యూరిటీ ప్లాన్, వ్యయ పర్యవేక్షణ
- మీడియా కమ్యూనికేషన్, ఫిర్యాదుల పరిష్కారం
- లైవ్ వెబ్‌కాస్ట్, ఎస్ఎంఎస్ మానిటరింగ్
- పోలింగ్ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలు
మాదిరి అంశాలపై సంబంధిత నోడల్ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఓటర్లను మ్యాన్‌పవర్ జాబితాలో పొందుపరచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, ఓటర్ల అవగాహన కార్యక్రమాల కోసం ఈవీఎంలు, వివిప్యాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
స్వీప్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, జోనల్ కమిషనర్లు వాటిలో చురుకుగా పాల్గొనాలని కమిషనర్ పేర్కొన్నారు. మీడియా కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అన్ని నోడల్ అధికారులు తమ సన్నద్ధతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సిందిగా, వారం రోజుల్లో మరో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తానని కమిషనర్ స్పష్టం చేశారు.
Post a Comment