మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం : టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
కొత్తగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రేమ, సోదరభావం, ధర్మచింతనతో నిండివుంటాయని, ప్రతి మానవుడు ఆ ఆచరణను జీవితంలో అనుసరించాలన్నారు.
మహోన్నత గ్రంథం దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసిన మహమ్మద్ ప్రవక్త సమాజంలో హింస, ద్వేషాలను తొలగించి శాంతి, సమానత్వం వైపు నడిపించారని గుర్తు చేశారు. ప్రవక్త జన్మదినమే మిలాద్-ఉన్-నబీ అని, ఈ రోజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తరువాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నాగా సీతారాములు పాల్గొని సేవా కార్యక్రమంలో భాగమయ్యారు.
ఈ వేడుకలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి, మహమ్మద్ ఖాన్, సీఐలు శివప్రసాద్, కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ - సిపిఐ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment