మహిళా ఉద్యోగిని వేధింపుల కేసులో పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ అరెస్ట్
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల తహసీల్దార్ రవీందర్‌పై మహిళా ఉద్యోగిని వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, విధి నిర్వహణలో కలసి పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపై రవీందర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. వాట్సప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపడమే కాకుండా, పలుమార్లు కాల్స్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక, ఈ విషయం ఫిర్యాదుకు దారితీస్తుందన్న సమాచారం అందుకున్న రవీందర్, మరో ఎమ్మార్వో సహాయంతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే బాధితురాలు వెనుకడుగు వేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుండగా, రవీందర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల పోలీసులు వెల్లడించారు.
👉 ఈ ఘటనతో స్థానికంగా సంచలనం రేగగా, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Post a Comment