ఆదివాసీ సంఘాల ఐక్య సభలోలంబాడా నేతలకు హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో శుక్రవారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదార్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి పోడియం బాలాజు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ – “మా ఆదివాసీ నాయకుల జోలికొస్తే చూస్తూ ఊరుకోం… మా నాయకులను బేరవేయడం మానుకోవాలి. లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం” అని హెచ్చరించారు.
లంబాడా నేతలపై విమర్శలు
సమావేశంలో మాట్లాడుతూ నేతలు, ఆదివాసీ నాయకులు తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావుపై లంబాడా నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. “మీకు ఏమైనా సమస్యలు ఉంటే సుప్రీం కోర్టులో చూసుకోండి కానీ మా నాయకులను బెదిరించడం మానుకోండి” అని లంబాడా నేతలకు సూచించారు.
కీలక తీర్మానాలు
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి.
- లంబాడాల తొలగింపు అంశంపై అన్ని సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) ఏర్పాటు.
- ప్రతి గూడెంలో చైతన్య యాత్రలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచడం.
- స్థానిక ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాల సమర్పణ.
- త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహణ.
లంబాడాలపై ఆరోపణలు
ఆదివాసీ నేతలు మాట్లాడుతూ –
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం లంబాడీలు ST జాబితాలో లేరని స్పష్టం చేశారు.
- లంబాడీలు ఆదివాసీల రిజర్వేషన్లు, ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
- వారికి ST హోదా వర్తించదని స్పష్టంచేశారు.
- తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావులకు అన్ని ఆదివాసీ సంఘాలు అండగా నిలుస్తాయి అని ప్రకటించారు.
హాజరైన నాయకులు
ఈ సమావేశంలో దరబోయిన రమేష్, ఈసల సురేష్, బుగ్గ రామనాథం, తెల్లం నరసింహారావు, వాసం శ్రీకాంత్, కల్తీ రాంప్రసాద్, ముక్తి రాజు, సెటిపల్లి శ్రీను, గణిబోయిన శ్రీను, జెజ్జెర లింగేశ్వరరావు, పునేం శ్రీనివాస్, కోడెం వెంకటేశ్వర్లు, పూసం సుధీర్, పాయం లక్ష్మినరసు, సిద్దబోన నరసింహరావు, కోరెం కృష్ణ, వట్టం కార్తీక్, ఊకె రామకృష్ణ, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post a Comment