మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్


హన్మకొండ జిల్లా, సెప్టెంబర్ 15: వరంగల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యను సోమవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

నిన్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన “మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అన్న సవాలు విపరీతమైన వేడి పుట్టించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ రఘునాథపల్లి మండల పర్యటనకు బయలుదేరిన రాజయ్యను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పర్యటన చేయొద్దని హెచ్చరించినా, వినకపోవడంతో ఆయనను గృహ నిర్భంధం చేశారు. దీనితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగగా, ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక, ఆదివారం మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ—
🔹 “కడియం శ్రీహరికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలి”
🔹 “కూతురు కోసం పార్టీ మార్చి, రూ.200 కోట్లకు ఎమ్మెల్యే సీటు అమ్మేశాడు”
🔹 “సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలి” అని తీవ్ర ఆరోపణలు చేశారు.

వరంగల్ రాజకీయ సమీకరణాలపై ఈ పరిణామాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.