ఔటర్ రింగ్ రోడ్డుపై విషాదం – కారు బోల్తా, ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

 

ఔటర్ రింగ్ రోడ్డుపై విషాదం – కారు బోల్తా, ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్‌, సెప్టెంబర్ 15: అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరళ మైసమ్మ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న కారులో అపఘాతం సంభవించింది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్య రెడ్డి (స్వస్థలం సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామం) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు విలపిస్తూ హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 వేగమే మృత్యువు కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.