పాల్వంచ అన్నదాతలకు అన్నం అందించిన కాంపెల్లి కనకేష్ పటేల్

పాల్వంచ అన్నదాతలకు అన్నం అందించిన కాంపెల్లి కనకేష్ పటేల్


పాల్వంచ, సెప్టెంబర్ 17: యూరియా కోసం ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న పాల్వంచ మండల రైతులకు భోజన సదుపాయం కల్పిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ మూడో రోజు కూడా అన్నదానాన్ని నిర్వహించారు.

జగన్నాధపురం రైతు వేదిక వద్ద ఈ కార్యక్రమం జరుగగా, కనకేష్ పటేల్ మాట్లాడుతూ — “మనకి అన్నం పెట్టే రైతుల కడుపు నింపడం సంతోషం, వారు ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. రైతులు ఇలాగే ఇబ్బంది పడితే భోజన సదుపాయం నిరంతరం కొనసాగిస్తాను” అని తెలిపారు.

అలాగే యూరియా సరఫరా సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ పట్టణ, మండల పరిధిలో 20 వేల మందికి పైగా రైతులు వ్యవసాయం చేస్తున్నా ప్రతిరోజు 500 మందికి పైగా రైతులు సొసైటీ కార్యాలయాలు, రైతు వేదిక వద్ద ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉంటున్నారని, చాలా మందికి ఒక్క బస్తా యూరియా కూడా అందక వెనుదిరుగుతున్నారని తెలిపారు.

“ఒక ఎకరా, రెండు ఎకరాలు కాదు, 5–10 ఎకరాలు సాగు చేసే రైతుకి ఒక్క బస్తా యూరియా సరిపోదు. అధికారులు శ్రద్ధ తీసుకొని ప్రతిరోజూ సరిపడా యూరియా అందేలా చూడాలి. ప్రతి రైతుకి కనీసం రెండు బస్తాలకు పైగా ఇవ్వడం అవసరం” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, కొట్టె రాఘవేంద్ర (రవి), గంగాధరి పుల్లయ్య, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, గజ్జెల రితిక్, కాంపెల్లి నవీన్, కూరెళ్లి మురళి మోహన్, చిన్నకర్పన్ ప్రవీణ్, తోట సతీష్, గిద్దలూరి శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.