మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు


మెదక్, సెప్టెంబర్ 17 : మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నాడు విశ్వకర్మ జయంతి వేడుకలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించారు. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లలోని పలు మండల కేంద్రాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ స్వామిని ఆరాధించారు.

తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో విశ్వకర్మ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా విశ్వకర్మ కార్మిక సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ చారి జెండా ఆవిష్కరించి, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, రఘుపతి, కార్మిక సంఘం నాయకులు శ్రీధర్ చారి, సతీష్ చారి తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విశ్వకర్మ పంచకులాల వృత్తులు సమాజానికి పునాది వంటివని, వారి కళా నైపుణ్యమే ఇతర వర్గాలకు ఆదారమని పేర్కొన్నారు. విశ్వకర్మలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రముఖ అతిథులు రవీందర్ గుప్తా, నందాల శ్రీనివాస్, మామిడి వెంకటేష్, రంగుపతి, కృష్ణ, శ్రీధర్ చారి, సతీష్ చారి, నారాయణ చారి, సీనియర్ పాత్రికేయులు సిఆర్ డాక్టర్ జానకిరామ్, గౌడ్ స్వామి, ప్రశాంత్‌లను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో బ్రహ్మచారి, వెంకటేష్ చారి, నవీన్ చారి, రాజు చారి, నరేష్ చారి, స్వామి చారి, ముత్యాలు, ఆంజనేయులు, యాదగిరి, ప్రభాకర్, నాగరాజు, కృష్ణ, బిక్షపతి, సంతోష్ చారి, వికాస్ చారి, సాయి దుర్గ, సదాశివ చారి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.