తల్లి మందలించిందన్న కారణంతో నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 17: మూసాపేటలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించిందన్న కారణంతో ఓ 18 ఏళ్ల కొత్త వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే, యాదవబస్తీకి చెందిన జానకీరావు, తలసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె రమ్యకు మూడు నెలల క్రితం ప్రొక్లెయిన్ డ్రైవర్ అశోక్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం దంపతులు రమ్య పుట్టింట్లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో రమ్య తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన తల్లి మందలించింది. “వివాహం అయింది, ఇంటి పనులు నేర్చుకోవాలి” అంటూ సూచించింది. అనంతరం ఇద్దరూ కలిసి మార్కెట్‌కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత తల్లి బయటకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న రమ్య ఆత్మహత్యకు పాల్పడింది.
రాత్రి ఆలస్యమైనా గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన తల్లి కిటికీ తలుపు తొంగిచూసింది. రమ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటం గమనించి, పొరుగువారి సహాయంతో కిందకు దించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment