మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు జోరుగా ఆన్లైన్ దరఖాస్తులు

మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు జోరుగా ఆన్లైన్ దరఖాస్తులు

మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలు జోరుగా ఆన్లైన్ దరఖాస్తులు


భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం మైనార్టీ బీసీ ఈ ఫోర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మహబూబ్ జాని ఆధ్వర్యంలో మైనారిటీ పథకాల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రెండు కీలక పథకాల పట్ల జిల్లా వ్యాప్తంగా మైనార్టీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన “ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన” మరియు “రేవంత్ అన్నాక సహారా మిస్కిన్” పథకాలు మైనారిటీలకు ఊరట కలిగించనున్నాయని నేతలు పేర్కొన్నారు. ఈ పథకాలలో విడాకులు పొందిన మహిళలు, అనాథ మహిళలు, అవివాహిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో నిరాధార మహిళలకు ఆర్థిక భరోసా లభించనుంది.

అదేవిధంగా ఫకీర్, దూదేకుల వర్గాలకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు అందించే స్కీమ్‌ను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ఈ వర్గాల జీవన విధానం మరింత సులభం కానుందని భావిస్తున్నారు.

జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మహబూబ్ జాని మాట్లాడుతూ— “ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైనవే. జిల్లాలోని అర్హులైన మహిళలు, ఫకీర్ వర్గాల వారు, ఇతర లబ్ధిదారులు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. దీనికోసం మైనారిటీ బీసీ ఈ ఫోర్ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం” అని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వందలాది మంది లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారని, మరింత విస్తృత స్థాయిలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.

మైనారిటీల సంక్షేమానికి నూతన పథకాలు ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.