లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగాం క్షేత్ర ఇంజనీరు అరెస్ట్

 

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగాం క్షేత్ర ఇంజనీరు అరెస్ట్

జనగాం : సెప్టెంబర్ 25 : ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం క్రింద పూర్తి చేసిన పనులకు గాను చివరి బిల్లును ప్రాసెస్ చేసి తదుపరి చర్యల కోసం పంపించడానికి సహాయం చేస్తానని చెప్పి, జనగాం లోని తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో క్షేత్ర ఇంజనీరు (పొరుగు సేవల ఉద్యోగి) సామల రమేష్ లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుని నుండి మొత్తం రూ.18,000/- లంచం అడిగిన రమేష్, ముందుగా రూ.10,000/- స్వీకరించాడు. అనంతరం మిగతా రూ.8,000/- తీసుకుంటూ ఈ రోజు (25.09.2025) తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ప్రజలకు ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగిన సందర్భంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అవినీతి నిరోధక శాఖ హామీ ఇచ్చింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.