విదేశీ బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్న కవిత

విదేశీ బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్న కవిత


హైదరాబాద్: సెప్టెంబర్ 25: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటనకు గురువారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సమాజం నిర్వహిస్తున్న సంబరాల్లో ఆమె పాల్గొననున్నారు.

  • గురువారం ఉదయం 11 గంటలకు హర్యానా రాష్ట్రం రోహ్తక్‌లో జరిగే మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటారు.
  • అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్‌కి బయల్దేరుతారు.
  • సెప్టెంబర్ 26న ఖతార్‌లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు.
  • 27న మాల్టాకు చేరుకుని అక్కడ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు.
  • 28న లండన్ చేరుకునే కవిత, అక్కడ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ పండుగలో పాల్గొంటారు.

ప్రతి సంవత్సరం విదేశాల్లోని తెలంగాణ సంఘాలు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటుండగా, కవిత ఆహ్వానం మేరకు ఈసారి పలు దేశాల్లో జరగనున్న ఉత్సవాలకు హాజరుకానున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.