🌧️ నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక 🌧️

🌧️ నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక 🌧️


హైదరాబాద్: ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుతుందని, 27వ తేదీ నాటికి భూభాగాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

📍 గురువారం (25వ తేదీ)

  • ఆదిలాబాద్
  • కొమురంభీం ఆసిఫాబాద్
  • మంచిర్యాల
  • నిర్మల్
  • నిజామాబాద్
  • పెద్దపల్లి
  • జయశంకర్ భూపాలపల్లి
  • ములుగు
  • భద్రాద్రి కొత్తగూడెం
  • మహబూబాబాద్
  • వరంగల్
  • హనుమకొండ

➡️ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

📍 శుక్రవారం (26వ తేదీ)

  • నిర్మల్
  • నిజామాబాద్
  • వికారాబాద్
  • సంగారెడ్డి
  • మెదక్
  • కామారెడ్డి
  • మహబూబ్‌నగర్

➡️ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

👉 రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.