కొత్తగూడెంలో రామ్మోహన్‌రావు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – డీఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం గణేష్ బస్తీలో చోటుచేసుకున్న రామ్మోహన్‌రావు హత్య కేసులో పోలీసులు వేగంగా విచారణ జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే – ఈ నెల 22న రాత్రి 9 గంటల సమయంలో గణేష్ బస్తీకి చెందిన రామ్మోహన్‌రావు (58) తన ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో మహమ్మద్ సాహిర్ (26), వాసంపల్లి వంశీ (30) సుత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. రామవరంనకు చెందిన సత్యవతితో రామ్మోహన్‌రావుకు ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.
డీఎస్పీ రెహమాన్ తెలిపారు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ శివశంకర్, టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు మరియు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment