నోబెల్ ప్రైజ్ 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి ప్రతిష్టాత్మక పురస్కారం

నోబెల్ ప్రైజ్ 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి ప్రతిష్టాత్మక పురస్కారం


2025 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతి (Nobel Prize 2025) ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. పెరిఫెరల్ ఇమ్యూన్‌ టాలరెన్స్‌ (Peripheral Immune Tolerance) రంగంలో చేసిన అద్భుత ఆవిష్కరణలకు గుర్తింపుగా మేరీ ఇ. బ్రున్‌కో (Mary E. Brunkow), ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ (Fred Ramsdell), షిమన్‌ సకాగుచీ (Shimon Sakaguchi) లకు నోబెల్‌ కమిటీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించింది.

ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలతో శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎలా స్వయంగా ఆరోగ్యకర కణాలపై దాడి చేయకుండా నియంత్రించబడుతుందో విశదమైంది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధుల (Autoimmune diseases) చికిత్సలకు దారితీసే మార్గాన్ని సుగమం చేసింది.

వైద్య విభాగంతో నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 13 వరకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, శాంతి బహుమతులు వరుసగా ప్రకటించనున్నారు.

— నోబెల్‌ కమిటీ అధికారిక ప్రకటన ప్రకారం

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.