పోక్సో కేసులో వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

పోక్సో కేసులో వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష


కొత్తగూడెం లీగల్ న్యూస్ :: పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జ్, అదనపు ఛార్జ్) ఎస్. సరిత మంగళవారం విధించారు.

వివరాల్లోకి వెళ్తే — మణుగూరు మండలం వాగుమల్లారం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై జానం పేట గ్రామానికి చెందిన గాడిద శ్రీనివాస్ దారుణానికి పాల్పడిన ఘటన 2024 జూన్ 12న జరిగింది. ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మణుగూరు ఇన్‌స్పెక్టర్ సతీష్ కేసు నమోదు చేశారు. అనంతరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ బి. రవీందర్ రెడ్డి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో మొత్తం 11 మంది సాక్షులను విచారించింది. సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా శ్రీనివాస్ నేరం రుజువయ్యింది. దాంతో న్యాయమూర్తి ఆయనకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరిన్ని ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్‌ఐ డి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ సయ్యద్ అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ అశోక్ సహకరించారు..

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.