₹35.23 లక్షలు వృద్ధురాలిని మోసం భావోద్వేగాలకు లోనై నేరగాళ్ల బారిన పడవద్దు
🚨తస్మాత్ జాగ్రత్త..!🚨✒️హైదరాబాద్: కొత్త కొత్త పద్ధతులతో సైబర్ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. భావోద్వేగాలను ఆసరాగా తీసుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ నేరగాళ్లు తాజాగా మరో వృద్ధురాలిని మోసం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు “లండన్‌లో మీ కుమారుడికి ప్రమాదం జరిగింది” అని నమ్మబలికారు. వాట్సాప్ ద్వారా స్టీవ్ అనే వ్యక్తి కాల్ చేసి, “మీ కుమారుడిని ఎయిర్‌పోర్టులో ప్రమాదం తర్వాత ఆస్పత్రిలో చేర్చడం లేదు, ఎందుకంటే అతని ఐడెంటిటీ లేదు” అని చెప్పాడు.
తన కుమారుడిని రక్షించాలనే తల్లిప్రేమతో వృద్ధురాలు స్టీవ్ చెప్పినట్లు చికిత్స ఖర్చుల పేరుతో మొత్తం ₹35.23 లక్షలు బదిలీ చేసింది. కొంతసమయం తర్వాత కుమారుడి ఫోటో, వీడియో చూపించమని అడగగా దుండగుడు నిరాకరించాడు. అనుమానం వచ్చిన ఆమె నేరుగా తన కుమారుడికి ఫోన్ చేయగా — కుమారుడు క్షేమంగా ఉన్నట్లు తేలింది.
తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధురాలు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
⚠️ భావోద్వేగాలకు లోనై నేరగాళ్ల బారిన పడవద్దు – జాగ్రత్తగా ఉండండి! ⚠️

Post a Comment