రోటరీ ఇండియా నేషనల్ సి‌ఎస్‌ఆర్ అవార్డ్స్‌ 2025 సదరన్ రీజియన్‌లో ‘నవ లిమిటెడ్’కు అవార్డు

రోటరీ ఇండియా నేషనల్ సి‌ఎస్‌ఆర్ అవార్డ్స్‌ 2025 సదరన్ రీజియన్‌లో ‘నవ లిమిటెడ్’కు అవార్డు


బెంగళూరు, అక్టోబర్‌ 17: రోటరీ ఇండియా నేషనల్ సి‌ఎస్‌ఆర్ అవార్డ్స్‌–2025 సదరన్ రీజియన్ కార్యక్రమంలో నవ లిమిటెడ్ సంస్థకు ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. శనివారం బెంగళూరులోని చాంచారి పావిలియన్‌ వేదికగా జరిగిన ఈ వేడుకలో ఫిక్సీ ప్రెసిడెంట్ శ్రీమతి ఉమా రెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రతినిధులు — ప్రెసిడెంట్ మరియు యూనిట్ హెడ్ రియర్ అడ్మిరల్‌ ఎల్‌.వి‌. శరత్‌ బాబు (V), కంపెనీ సెక్రటరీ & వైస్ ప్రెసిడెంట్ వి‌.ఎస్‌. రాజు, జనరల్ మేనేజర్ (సి‌ఎస్‌ఆర్) ఎంజీఎం ప్రసాద్ — అవార్డును స్వీకరించారు.

సామాజిక బాధ్యత కార్యక్రమాల భాగంగా ఆరోగ్యం, విద్య, జీవనోపాధి మరియు ఇతర రంగాల్లో సంస్థ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు రియర్ అడ్మిరల్ ఎల్‌.వి‌. శరత్‌ బాబు తెలిపారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎఫ్‌.ఎల్‌.టి‌.ఎల్‌.టి‌. ఆర్‌.టి‌.ఎన్‌. కె.పి. నగేష్ (డైరెక్టర్, రోటరీ ఇంటర్నేషనల్) హాజరయ్యారు. అలాగే ఫిక్సీ ప్రెసిడెంట్ శ్రీమతి ఉమా రెడ్డి, డి.జి. వినోద్ సరౌజి, పి.డి.జి. ఆర్‌.టి‌.ఎన్‌. జితేంద్ర అనేజ, ఆర్‌.టి‌.ఎన్‌. రామ్ కుమార్ శేషు, ఆర్‌.టి‌.ఎన్‌. త్రివిక్రమ్ జోషి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.