శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత రూ.4.5 కోట్ల విలువైన 4.5 కేజీల విదేశీ గంజాయి
రూ.4.5 కోట్ల విలువైన 4.5 కేజీల విదేశీ గంజాయి సీజ్ చేసిన డీఆర్ఐ
హైదరాబాద్, అక్టోబర్ 27 : హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్ రాకెట్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరోసారి విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించారు. బ్యాంకాక్‌కు వెళ్లే ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేసిన సమయంలో, అధికారులు రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని పట్టుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, ఆ ప్రయాణికుడు లగేజీ బ్యాగ్ దిగువ భాగంలో గంజాయి ప్యాకెట్లను నిపుణంగా దాచిపెట్టినట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన బాగేజీని ఎక్స్–రే స్కానర్ ద్వారా పరీక్షించగా డ్రగ్స్ బయటపడ్డాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి మూలం, గమ్యం, మరియు అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ సంబంధాలపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో ఇలాంటి డ్రగ్ స్మగ్లింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా తనిఖీలను అధికారులు మరింత కఠినతరం చేశారు.

Post a Comment